MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

జలాల్ పేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు నరసింహ జయంతి పూజలు

  • April 30, 2026
  • 0 min read
జలాల్ పేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు నరసింహ జయంతి పూజలు

మచిలీపట్నం:

జలాల్ పేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు నరసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం విశేష పుష్ప, కుంకుమార్చనలు జరిగాయి. సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవ మూర్తులకు వేదాంతం గిరిధర్ ఆనంద్ నేతృత్వంలో అర్చకులు దీవి గోపాల ప్రసాద్, దివి నరసింహ కృష్ణ గరుడసేవ నిర్వహించారు. అనంతరం స్తంబోద్భవ నారసింహ అలంకరణ రూపంలో నరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి గీతా పారాయణ చేశారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *