MachilipatnamLocal News
April 30, 2026
పోలీస్ & లీగల్ డైరీ

పదవి విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన పోలీసు అధికారులు

  • April 30, 2026
  • 1 min read
[addtoany]
పదవి విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన పోలీసు అధికారులు

మచిలీపట్నం :

జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పనిచేసి గురువారం పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ బి. సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

పదవీ విరమణ పొందిన సిబ్బంది – K. శ్రీనివాస్ పోలీస్ శిక్షణ కేంద్రం మచిలీపట్నం, P. మురళీకృష్ణ మహిళా పోలీస్ స్టేషన్, G. వీరస్వామి వీరవల్లి పోలీస్ స్టేషన్.

పదవీ విరమణ పొందిన సిబ్బంది తమ సేవా కాలంలో పోలీసు శాఖకు చేసిన సేవలు అమూల్యమని, వారి కృషి, అంకితభావం కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసు సేవలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేసిన వారికి ఈ రోజు గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తెలిపారు.

పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని, రిటైర్డ్ సిబ్బందికి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఇప్పటివరకు నిరంతరం వీధులతో బిజీగా ఉన్నారని, విరమణ అనంతరం మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ వ్యాయామం ఇతర వ్యాపకాలను అలవర్చుకోవాలని అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ తెలిపారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *