మచిలీపట్నం జిల్లా కోర్టులో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మచిలీపట్నం:
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఉత్సాహంగా జరిగాయి.

