MachilipatnamLocal News
April 14, 2026
జిల్లా

అభివృద్ధి, సంక్షేమానికి విజన్ డాక్యుమెంట్‌లా 2026-27 బడ్జెట్

  • February 14, 2026
  • 1 min read
[addtoany]
అభివృద్ధి, సంక్షేమానికి విజన్ డాక్యుమెంట్‌లా 2026-27 బడ్జెట్
ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది
 
బడుగు బలహీన వర్గాల సంక్షేమం, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట
 
సంక్షేమానికి ఏకంగా రూ.91,527 కోట్ల కేటాయింపు పేదల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం
 
మచిలీపట్నం :
 
         ఏపీ నెంబర్ వన్ లక్ష్యంగా సాగుతున్న పాలనకు 2026-27 బడ్జెట్ విజన్ డాక్యుమెంట్‌లా ఉంది. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును నిర్దేశించేలా బడ్జెట్ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశ దిశ చూపించేలా బడ్జెట్ రూపొందించడం హర్షణీయం. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సాగునీటి రంగం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశాం. 
 
        చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆలంబనగా ఉంది. బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.51 వేల కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.20,644 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.9,190 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.6090 కోట్లు, మహిళా సంక్షేమానికి రూ.4582 కోట్లు చొప్పున సంక్షేమం కోసం ఏకంగా రూ.91,527 కోట్లు కేటాయించడం పేదల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. పాఠశాల విద్య కు రూ.32,308 కోట్ల కేటాయింపు విద్యారంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
 
         గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా పంచాయతీరాజ్ శాఖకు రూ.22,942 కోట్లు కేటాయించాం. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేలా వైద్యారోగ్య రంగానికి రూ.19,306 కోట్లు కేటాయించాం. విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ప్రకటించిన బడ్జెట్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *