MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

  • September 4, 2026
  • 0 min read
శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

మచిలీపట్నం:

స్థానిక చల్లరస్తా వద్ద వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో తిక్కిశెట్టి మోహనరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, ధర్మకర్తలు సీతారావమ్మ, శాంతకుమారి, కోటేశ్వరమ్మ మరియు అర్చకులు వాసు గారి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తోమాలసేవ తదితర విశేష కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం, ఆలయ పురోహితులు దత్తు గారి పర్యవేక్షణలో గోపూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ పూజల్లో మహిళా భక్తులు, యాదవ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రొండి కృష్ణయాదవ్, బందరుకోట ఏకాంబరేశ్వర దేవాలయం చైర్మన్ బచ్చుల హరిబాబు, గౌరా శ్రీ హరి, మాజీ కౌన్సిలర్ నాలి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN