MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మచిలీపట్నం స్కౌట్స్ అండ్ గైడ్స్ రీజినల్ క్యాంపును సందర్శించిన డీఈవో

  • April 21, 2026
  • 0 min read
మచిలీపట్నం స్కౌట్స్ అండ్ గైడ్స్ రీజినల్ క్యాంపును సందర్శించిన డీఈవో

మచిలీపట్నం :

 
మచిలీపట్నం స్కౌట్స్ అండ్ గైడ్స్ రీజినల్ క్యాంపు ట్రైనింగ్ సెంటర్ నందు 17 నుండి 22 వరకు గైడ్స్ శిక్షణ జరుగుతుంది. ఇందులో ప్రవేశ్, ప్రథమ, ద్వితీయ సోపాన్ ట్రైనింగ్ నకు140 మంది విద్యార్థులు, రాజ్య పురస్కార్ ట్రైనింగ్ నకు 21 మంది గైడ్స్ విద్యార్థులు క్యాంపు లో శిక్షణ పొందారు. ఇందులో నలుగురు కాకినాడ నుంచి 17 మంది కృష్ణా జిల్లా గైడ్ విద్యార్థినిలు ఉన్నారు. బేసిక్ గైడ్ కెప్టెన్ ట్రైనింగ్ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతోంది. 35 మంది పి ఎం శ్రీ టీచర్లు హాజరైనారు.
 
ఈ ట్రైనింగ్ క్యాంపును ఈరోజు సందర్శించిన కృష్ణాజిల్లా డిఇఓ యూ వి సుబ్బారావు  మాట్లాడుతూ
ఇంత ఎండలు ఉన్నా మీరంతా ఇంత డిసిప్లేన్ తో శిక్షణ పొందిన మీరు జీవితంలో చక్కని ఉపాధి అవకాశాలు పొందుతారని ఆశీర్వదించారు. బేసిక్ ఎల్వోసీగా రజియా బేగం, సిహెచ్ సుభాషిణి ఏ యల్ టి శిక్షణ ఇచ్చారు.
 
డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈకాంపును డిస్ట్రిక్ట్ సెక్రటరీ పి లలిత్ మోహన్ చక్కని సదుపాయాలు ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని డిఇఓ అభినందించారు.
ఈ శిక్షణలో స్టాఫ్ గా ఓలేటి ఉమాసరస్వతి, ఎ రాజేశ్వరి మొదలగువారు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *