మచిలీపట్నం పంపుల చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు నీటిలో ఒక వ్యక్తి మృతదేహం తేలియాడుతూ కనిపించడం గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ వ్యక్తి వయస్సు సుమారు 40 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇనకుదురు పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.