MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

కూటమి పాలనలో సామాన్యుడిపై విపరీతమైన భారం: మాజీ మంత్రి పేర్ని నాని

  • October 27, 2026
  • 1 min read
కూటమి పాలనలో సామాన్యుడిపై విపరీతమైన భారం: మాజీ మంత్రి పేర్ని నాని

అప్పులు, ధరల పెరుగుదలపై మండిపాటు.. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని పిలుపు

మచిలీపట్నం:

రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రజలకు ఏ మేలు చేశారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్‌లు మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని విమర్శించారు. మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విలేకరుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రంలో బియ్యం కట్ట ధర ₹2600కు, ఉల్లిపాయల ధర కేజీ ₹60కి చేరి నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తూ చంద్రబాబు ‘ఫేక్ సీఎం’గా మారారని ధ్వజమెత్తారు. కూటమి నేతలు ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లలో విలాసవంతంగా తిరుగుతూ రెండున్నరేళ్లలోనే ₹4 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ముంచారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

పంచాయతీల నిర్వహణ గురించి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ నిధులను కూడా ప్రభుత్వం మళ్లించిందని, గ్రామాల్లో వీధిలైట్లు వేయడానికి, సున్నం కొట్టడానికి కూడా పైసలు లేని పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. మహిళలకు ₹1500 ఇస్తామన్న హామీని నీరుగార్చారని, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని కేవలం 5 కేటగిరీలకే పరిమితం చేసి అవమానిస్తున్నారని ఆరోపించారు. 7 లక్షల పింఛన్లు తీసివేసి, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి ప్రజలను దగా చేశారని విమర్శించారు. ఈ అబద్ధపు, లూటీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పేర్ని నాని పిలుపునిచ్చారు.

About Author

SSN