MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

13 ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా స్థాయి కమిటీ

  • October 27, 2026
  • 1 min read
13 ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేసిన జిల్లా స్థాయి కమిటీ

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధ్యక్షతన కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల నుంచి వచ్చిన దరఖాస్తులు, తనిఖీ నివేదికలను పరిశీలించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఉన్న మొత్తం 13 ఆసుపత్రులకు కమిటీ అనుమతులు మంజూరు చేసింది. 

ఇందులో కొత్తగా నమోదు కోరిన 2 ఆసుపత్రులు, పునరుద్ధరణ (రెన్యూవల్) కోరిన 7 ఆసుపత్రులు మరియు మార్పుల (మోడిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకున్న 4 ఆసుపత్రులు ఉన్నాయి. ఈ సమావేశంలో తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి టి. రాజా వెంకటాద్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి.ఎల్. దయాకర్, అదనపు పోలీసు సూపరింటెండెంట్ బి. చంద్రశేఖర్, ఎన్‌జీవో సభ్యుడు ఎం. ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN