MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో డీఈఓ

  • September 7, 2026
  • 1 min read
విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో డీఈఓ

మచిలీపట్నం:

విద్యా ప్రమాణాలను మరింతగా పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేసి కృష్ణా జిల్లాను విద్యారంగంలో ముందంజలో నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) యు.వి. సుబ్బారావు పిలుపునిచ్చారు. సోమవారం డీఈఓ ఛాంబర్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన స్కూల్ అసిస్టెంట్లు డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి (పురిటిగడ్డ ZPHS+), రాజ్యలక్ష్మి (ఆకునూరు GHS) ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఈఓ వారిని అభినందిస్తూ, లభించిన గుర్తింపు బాధ్యతను మరింత పెంచుతుందని, ఇతర ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలవాలని అన్నారు.

త్వరలో విద్యావిధానంలో రానున్న సంస్కరణలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకోవాలని డీఈఓ సూచించారు. ఇందులో భాగంగా సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు ఉపాధ్యాయులను పంపి, అక్కడి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. తరగతి గదిని కేవలం పాఠాలకే పరిమితం చేయకుండా విలువలు, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి బోధించాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. డీఈఓ సూచనలను స్ఫూర్తిగా తీసుకుని విద్యాభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తామని అవార్డు గ్రహీతలు పేర్కొన్నారు.

About Author

SSN