కృష్ణా యూనివర్సిటీ వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
మచిలీపట్నం:
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కోర్సుల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ కూన రాంజీ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పి. వీర బ్రహ్మచారి మంగళవారం తెలిపారు.
విడుదలైన ఫలితాలు
బి.ఎడ్ & స్పెషల్ బి.ఎడ్ (BED & Spl.BED) – IV సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
ఎల్.ఎల్.ఎం (LL.M) – II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)
రీవాల్యుయేషన్కు అవకాశం
సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం ಅಧಿಕారిక వెబ్సైట్ (www.kru.ac.in) ద్వారా సరిచూసుకోవచ్చు. రీవాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం)కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 21, 2026 నాటికి నిర్ణీత రుసుము చెల్లించి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

