అందరికీ సంక్షేమం అదే కూటమి లక్ష్యం
మచిలీపట్నం:
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందాలనేది కూటమి ప్రభుత్వ సంకల్పం
దీనిపై ఏరియా వారిగా కూటమి నాయకులు బాధ్యత తీసుకోవాలి
దేశంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
సంక్షేమం, అభివృద్ధి విషయంలో ముందంజలో
స్థానిక 22వ డివిజన్ ప్రజాదర్శినిలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. తల్లికి వందనం ,గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నామన్నారు.
పూర్తయిన జి ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులకు అందజేశామన్నారు. ఉపాధికి ఊతమిచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.కేంద్ర రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని అటకెక్కించారు అక్రమ కేసులు అరాచకాలతో పాలన చేశారన్నారు. నా పైన ఎన్నో అక్రమ కేసులు పెట్టారు.తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే , ఏ కేసుకి భయపడలేదన్నారు.
అడుగడుగునా ఇబ్బంది పెట్టడం అభివృద్ధికి అడ్డం పడడమే వైసీపీ నాయకుల దినచర్య, అమరావతికి జగన్ బందరుకు స్థానిక వైసీపీ నాయకులు ఆటంకంగా మారారని అయినా, మేమంతా సమిష్టిగా కూటమిలా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అనే కొత్త నాటకానికి తెర తీశారన్నారు.
అది గన్నో, బన్నో జనానికి అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా కూటమి పాలన జరుగుతుందన్నారు. దానిని అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అందుకు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగాలి. రాష్ట్రంలో కూటమి పాలన సుదీర్ఘ కాలం కొనసాగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంబరాన్ని అంటుతుందనడంలో సందేహం లేదన్నారు. కూటమి ఎప్పటికీ కలిసే ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కూటమి ఘన విజయం సాధించాలన్నారు.
ప్రజల మద్దతు కూటమి ప్రభుత్వానికి ఉండాలని, మీ ఆశీర్వాద బలమే మాకు శ్రీరామరక్ష అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.