MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం నిర్వహణ

  • June 3, 2026
  • 0 min read
మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం నిర్వహణ

మచిలీపట్నం:

క్లబ్ ఫుట్ సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అటువంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి కిరణ్ కుమార్ కోరారు. ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా బుధవారం మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్లబ్ ఫుట్ కలిగిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే క్లబ్ ఫుట్ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సకాలంలో చికిత్స అందించడం ద్వారా చిన్నారులు సాధారణ జీవితాన్ని గడపగలరనే విషయాన్ని వివరించారు. గతంలో క్లబ్ ఫుట్ కు కేవలం పిండి కట్టుకు పరిమితమైన వైద్యం ఇకపై శస్త్ర చికిత్స సేవలు కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. క్లబ్ ఫుట్ లోపాన్ని పుట్టిన వెంటనే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఎక్కువ శాతం కేసులను పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు చిన్నారుల్లో పాదాల ఆకృతిలో ఏవైనా అసాధారణతలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లీలా ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ భానుమూర్తి, డాక్టర్ భరత్ సింగ్ నాయక్, ఆర్థోపెడిక్ విభాగ వైద్యలు డా. హరీష్, డా. మనోహర్, డా. రాజన్, క్యూర్ ఇండియా ( క్యూర్ ఇండియా) సంస్థ పి పి సి ప్రతినిధులు రజిని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN