MachilipatnamLocal News
June 3, 2026
జాబ్స్

జూన్ 6న ఉయ్యూరులోని సిద్ధార్థ కళాశాల నందు జాబ్ మేళా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ

  • June 3, 2026
  • 1 min read
[addtoany]
జూన్ 6న ఉయ్యూరులోని సిద్ధార్థ కళాశాల నందు జాబ్ మేళా నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ

మచిలీపట్నం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.06.06.2026 శనివారం ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు లోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య & సుగర్కేన్ గ్రోవర్స్ సిద్ధార్థ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ తెలిపారు.

ఈ జాబ్ మేళాలో ప్రిన్స్టన్ ఐటి సర్వీసెస్, బంధన్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, జోయాలుక్కాస్, ముత్తూట్ ఫైనాన్స్, కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్, సంతోష్ ఆటోమోటార్స్, ముక్కు ఫైనాన్సియల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అడెక్కో వంటి 10కు పైగా ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.నరేష్ కుమార్ తెలిపారు.

ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి మంచి వేతనము ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, జూన్ 6న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in వెబ్సైట్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫారంలతో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్, పాన్, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 79813 68429, 96187 13243 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

About Author

SSN