MachilipatnamLocal News
May 11, 2026
మచిలీపట్నం

నగరంలో అగ్ని ప్రమాదం

  • April 12, 2026
  • 0 min read
[addtoany]
నగరంలో అగ్ని ప్రమాదం
మలబార్ గోల్డ్ షోరూం బయట తప్పిన పెను ప్రమాదం 
 
మచిలీపట్నం:
 
స్థానిక రాజాగారి సెంటర్లోని మలబార్ గోల్డ్ షాప్ బయట శనివారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మలబార్ షోరూమ్ పైభాగంలో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఎలక్ట్రికల్ ఫ్లెక్సీకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.అయితే, షోరూమ్ యాజమాన్యం వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించి ఘటనాస్థలానికి చేరుకున్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *