MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను సందర్శించిన డీఈవో

  • March 16, 2026
  • 0 min read
ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను సందర్శించిన డీఈవో
మచిలీపట్నం:
 
         సోమవారం నగరంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించారు. కృష్ణాజిల్లాలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు మీడియాకు తెలిపారు. 
      కృష్ణాజిల్లాలో మొత్తం 48 పరీక్షా కేంద్రాలను అధికారులు సందర్శించడం జరిగిందని తెలిపారు మొత్తం విద్యార్థులు 21,438 మంది విద్యార్థినీ విద్యార్థులకు గాను 21,173 మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరయ్యారని 265 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని దాదాపు 99 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని డీఈవో తెలిపారు.
        ప్రభుత్వ పరీక్షా సంచాలకులు డాక్టర్ కె.వి శ్రీనివాసులు రెడ్డి 6 పరీక్షా కేంద్రాలను, డాక్టర్ ఎం ఆర్ ప్రసన్నకుమార్ అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష ఆంధ్ర ప్రదేశ్ వారు 12 పరీక్షా కేంద్రాలను జిల్లా అబ్జర్వర్ స్థాయిలో జిల్లాలో పరిశీలించారు. డిఇఓ ఏడు పరీక్ష కేంద్రాల సందర్శించి పరీక్ష జరుగు విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్ లు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డిఇఓ ఒక ప్రకటనలో తెలియజేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *