MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ

  • March 25, 2026
  • 0 min read
ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన డిఇఓ
మచిలీపట్నం :
 
          బుధవారం నిర్వహించిన ఎస్ఎస్ సి ఫిజికల్ సైన్స్ పరీక్షా కేంద్రాలను కృష్ణాజిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు ఆకస్మికంగా సందర్శించారు. 
ఆయన పామర్రు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పామర్రు ఏ, బి సెంటర్ లను ఉయ్యూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉయ్యూరు ఎ, బి సెంటర్లు, వి ఆర్ కే యం  
హైస్కూల్ ఉయ్యూరు, ఫ్లోరా హై స్కూల్ ఉయ్యూరు, అస్సిసి హైస్కూల్ పామర్రు రెగ్యులర్ పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
          ఉయ్యూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రెండు ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను కూడా సందర్శించారు. పరీక్షలలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు.
మొత్తం 9 ఎస్ ఎస్ సి పరీక్షా కేంద్రాలను సందర్శించిన అనంతరం పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *