ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ ఎస్ ఎఫ్ డి సి & ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి పధకపు రుణ గ్రహీతలు బకాయి పడిన అసలు మొత్తమును ది. 30-04-2026 తేది లోపుగా చెల్లించిన ఎడల, ది.31-12-2025 వరకు వారి రుణ ఖాతాలో జమకాబడిన వడ్డీని పూర్తిగా రద్దు పరచబడునని కృష్ణా జిల్లా ఎస్.సి. కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు, జి.రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశము వినియోగించు కొనుటకు ఆఖరు తేది 30-04-2026. గడువు తేది 30-04-2026 తరువాత ఈ సదుపాయము రద్దు కాబడును, తదుపరి రుణ గ్రహీతలు అసలు మరియు వడ్డీ ను పూర్తిగా చెల్లించవలెనని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిరుపేద ఎస్.సి. లబ్దిదారులకు కలుగజేసిన ఈ సదావకాశమును వినియోగించుకుని రుణ విముక్తి పొందవలసినదిగా జి.రమేష్ ప్రకటనలో తెలిపారు.