MachilipatnamLocal News
May 24, 2026
పోలీస్ & లీగల్ డైరీ

సామరస్యత – సమాధాన్ సమరోహ్ నమోదుకు ఆఖరి తేదీ మే 31

  • May 13, 2026
  • 1 min read
[addtoany]
సామరస్యత – సమాధాన్ సమరోహ్ నమోదుకు ఆఖరి తేదీ మే 31

మచిలీపట్నం :

దేశమంతటా వివాదాల సామరస్యత – సమాధాన్ సమరోహ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమై ఆగస్టు 21, 22, 23 తేదీల వరకు కొనసాగి, సుప్రీం కోర్టు లో నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ తో ముగియనున్నదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం ముందు పెండింగిలో ఉన్న విషయములు సామరస్యమైన పరిష్కారాన్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రత్యేక లోక్ అదాలత్ లో న్యాయవాదులు మరియు కక్షిదారులు చురుకుగా పాల్గొనవలసినదిగాను మరియు వివాదాల పరిష్కారానికి సహకరించవలసినదిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి తెలిపారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి
పార్టీలు మరియు న్యాయవాదులు ఈ క్రింది గూగుల్ ఫామ్ ని పూరించడం ద్వారా వారి కేసు వివరాలు పంపవచ్చును. చివరి తేది 31-05-2026
Google Form Link: https://forms.gle/jqxefqF4BCWzukoP6 This Google Form is also available at https://www.sci.gov.in/ Last Date to fill the Google Form: 31st May, 2026
For all kinds of assistance/information, please contact: One Stop Centre (War Room) In-charge for SAMADHAN SAMAROH (Special Lok Adalat) Contact No.: 011-23112428, 011-23112528 One Stop Centre (Room No. 806 & 808, B Block, Additional Building Complex, Supreme Court of India) Landline No.: 011-23116464, 011-23116465
Contact No. of Director, C.R.P.: 011-23115652 Email: speciallokadalat2026@sci.nic.in

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *