MachilipatnamLocal News
April 22, 2026
జిల్లా

ఋణ బకాయి చెల్లించిన ఎస్.సి.కార్పొరేషన్ లబ్ధిదారునికి ఇంచార్జ్ కలెక్టర్ సన్మానం

  • April 21, 2026
  • 1 min read
[addtoany]
ఋణ బకాయి చెల్లించిన ఎస్.సి.కార్పొరేషన్ లబ్ధిదారునికి ఇంచార్జ్ కలెక్టర్ సన్మానం
మచిలీపట్నం :
 

భూమి కొనుగోలు పథకము క్రింద మంజూరు చేసిన ఋణ బకాయి మొత్తమును ఎస్.సి.కార్పొరేషన్ వారికి తిరిగి చెల్లించిన కోసూరు గ్రామమునకు చెందిన లబ్దిదారిణి బొంతు లక్ష్మిని సన్మానించిన కృష్ణా జిల్లా ఇన్చార్జ్  కలెక్టర్ ఎం.నవీన్ ఆమెకు తనఖా పత్రము, ఒరిజినల్ భూమి కొనుగోలు పత్రములు అందచేసి  బొంతు లక్ష్మీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమములో కృష్ణా జిల్లా ఎస్.సి.కార్పోరేషన్  కార్యనిర్వాహక సంచాలకులు (ఎఫ్ఎసి) జి.రమేష్ పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా షెడ్యుల్డ్ కులముల సేవ సహకార సంఘము, మచిలీపట్టణం వారి కార్యాలయము ద్వారా “భూమి కొనుగోలు పథకము” క్రింద 2017-18 సం.లో శ్రీమతి బొంతు లక్ష్మి, భర్త మరియదాసు, కోసూరు గ్రామము, మొవ్వ మండలము వారికి, కాజ గ్రామములో సర్వే నెం.730/2 లోని 0.71 సెంట్లు వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి శ్రీమతి బొంతు లక్ష్మి, భర్త మరియదాసు వారికి జీవనోపాధికై మంజూరు చేయుట జరిగినది.
 
భూమి విలువ (0.71 సెంట్లు భూమి) ఎస్.సి.కార్పొరేషన్ సబ్సిడీ (75%)
 ఎన్ ఎస్ ఎఫ్ డి సి  ఋణము (25%) – రూ.10,65,000/-
రూ.7,98,750/-
రూ.2,66,250/-
 75% కార్పొరేషన్ సబ్సిడీ రూ.7,98,750/- రాయితీ పోను మిగిలిన 25% NSFDC ఋణము రూ.2,66,250/-, 60 మాసములలో తిరిగి వడ్డీతో కలిపి (6% వడ్డీ సం.నకు) ఎస్.సి. కార్పొరేషన్ వారికి తిరిగి చెల్లించవలసి ఉన్నది. ఎస్.సి. కార్పొరేషన్ నిబంధనలు మేరకు శ్రీమతి బొంతు లక్ష్మీ, భర్త మరియదాసు చెల్లించవలసిన ఋణము అసలు రూ.2,66,250/- మరియు వడ్డీ రూ.1,10,750/- కలిపి రూ.3,77,000/- మొత్తము ఎస్.సి. కార్పొరేషన్, మచిలీపట్టణం వారికి చెల్లించుట జరిగినది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *