MachilipatnamLocal News
June 24, 2026
జిల్లా మచిలీపట్నం

కృష్ణాజిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధీర్ గురిజాల

  • June 23, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణాజిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సుధీర్ గురిజాల

మచిలీపట్నం:

ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృష్ణాజిల్లా నూతన అధ్యక్షుడిగా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్, సుధా స్టూడియో అధినేత సుధీర్ గురిజాల ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఫోటో ఫ్యాకల్టీ శివాజీ ఆధ్వర్యంలో నూతనంగా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కృష్ణాజిల్లాలోని ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల అభిప్రాయాలు, మద్దతుతో జిల్లా అధ్యక్షుడిగా సుధీర్ గురిజాలను నియమించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సుధీర్ గురిజాల మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఫోటో ఫ్యాకల్టీ శివాజీకి, అలాగే తన ఎంపికకు సహకరించిన కృష్ణాజిల్లా ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణాజిల్లాలోని ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల సమస్యలను పరిష్కరించేందుకు, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని సుధీర్ తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం, ఫోటోగ్రఫీ రంగ అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

About Author

SSN