MachilipatnamLocal News
June 15, 2026
జిల్లా

పమిడిముక్కల ఎన్టీఆర్ కాలనీలో పింఛన్లుపంపిణీ చేసిన ముఖ్యమంత్రి

  • May 1, 2026
  • 0 min read
[addtoany]
పమిడిముక్కల ఎన్టీఆర్ కాలనీలో పింఛన్లుపంపిణీ చేసిన ముఖ్యమంత్రి

పామర్రు:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ ఖర్చవుతోందని వివేక్ కుటుంబ సభ్యులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చదువులోనూ వివేక్ చురుగ్గా ఉంటారని, వ్యాధి నుంచి బయటపడేందుకు సాయం అందించాలని సీఎంను కోరారు. వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *