MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

హత్యను ప్రమాదముగా చిత్రీకరణ – హత్యగా నిర్ధారించిన పోలీసులు… నిందితుడు అరెస్ట్

  • February 13, 2026
  • 1 min read
హత్యను ప్రమాదముగా చిత్రీకరణ – హత్యగా నిర్ధారించిన పోలీసులు… నిందితుడు అరెస్ట్
మచిలీపట్నం :
 
        కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు మచిలీపట్నం సబ్ డివిజన్ పోలీసు అధికారి పర్యవేక్షణలో, ఇనగుదురు పోలీస్ స్టేషన్ లో నమోదైన క్రైమ్ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసును ప్రాధమికముగా అనుమానాస్పద మరణంగా నమోదు చేసి దర్యాప్తులో లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా భారతీయ న్యాయ సంహిత పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
         దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఆధారంగా కేసు యొక్క పూర్వపరాలను విలేకరులకు వివరించిన ఇనుకుదురు పేట సర్కిల్ ఇన్స్పెక్టర్. మృతుడు అల్లాడ సుబ్బారావు (77 సంవత్సరాలు) వద్ద ముద్దాయి గుడిసేన వెంకయ్య అలియాస్ వెంకన్న, చిలకలపూడి, మృతుని వద్ద కార్మికునిగా పని చేస్తున్నాడు. మృతుడు, నిందితుడి మధ్య ఆర్థిక విషయాలపై వివాదాలు ఉండడం, తరచూ అసభ్య పదజాలంతో తిడుతూ ఉండటం వలన ద్వేషము పెంచుకుని గత 20 జులై 2025 మధ్యాహ్నం సమయములో నిందితుడు చెక్క కమ్మితో మృతుడి తలపై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. 
 
          అనంతరం సంఘటనను ప్రమాదవశాత్తు జరిగినట్లు చూపించేందుకు చెక్క తలుపులు పడిపోయినట్లుగా నాటకం సృష్టించాడు. నేరానికి సంబందించిన ఆధారాలను నాశనం చేయుటకు దిండు, బెడ్ షీట్ ని పడేసాడు . సాంకేతిక ఆధారాలైన సీసీటీవీ పుటిజ్ విశ్లేషణ, అనుమానితుడిపై విస్తృత విచారణ, గ్రామ రెవెన్యూ అధికారి (VRO) సమక్షంలో ఇచ్చిన స్టేట్మెంట్, నేరానికి వాడిన వస్తువుని స్వాధీనం చేయుట ద్వారా ముద్దాయి నేరం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో న్యాయమూర్తి ముందు పరుస్తామని మెరుగైన విచారణ నిమిత్తం ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది అని పోలీసులు తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *