MachilipatnamLocal News
June 24, 2026
కృష్ణా జిల్లా

మాజీ మంత్రి పేర్ని నానికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం

  • February 13, 2026
  • 0 min read
[addtoany]
మాజీ మంత్రి పేర్ని నానికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశం
మచిలీపట్నం :
 
        మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు పేర్ని నానికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
 
         ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు.
 
          ఈ పిటిషన్‌పై నిన్న విచారణ చేపట్టిన హైకోర్టు, క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ పేర్ని నానికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు పరిశీలనలో, పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవని పేర్కొంది.
 
       క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి, తదుపరి విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *