MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు: రేపే చివరి తేదీ!

  • November 5, 2026
  • 1 min read
కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు: రేపే చివరి తేదీ!

గుంటూరు:

కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నవంబరు 6వ తేదీయే చివరి రోజని నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి స్పష్టం చేశారు. ఓటరు నమోదుకు ఒక రోజు మాత్రమే గడువు మిగిలి ఉందని, అర్హులైన ఉపాధ్యాయులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కొత్తగా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి

ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకూ కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందిస్తారని డిఆర్వో తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ఈసారి తప్పనిసరిగా ఫారం-19 ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇంకా 2,600 మంది నమోదు కావాల్సి ఉంది

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు కాగా, ప్రస్తుత నమోదు ప్రక్రియలో ఇప్పటివరకు 10,909 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆయన వివరించారు. గత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే ఇంకా సుమారు 2,600 మందికి పైగా అర్హులైన ఉపాధ్యాయులు నమోదు కావాల్సి ఉందన్నారు.

అర్హత కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులందరూ గడువు ముగిసేలోగా (నవంబరు 6) ఫారం-19 సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

About Author

SSN