MachilipatnamLocal News
November 16, 2026
మచిలీపట్నం

మంగినపూడి దత్తరామేశ్వర క్షేత్రంలో కార్తీక మాస ‘విశ్వశాంతి మహాయజ్ఞం’

  • November 5, 2026
  • 1 min read
మంగినపూడి దత్తరామేశ్వర క్షేత్రంలో కార్తీక మాస ‘విశ్వశాంతి మహాయజ్ఞం’

​మంగినపూడి:

కార్తీక మాస పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని మంగినపూడి బీచ్ సమీపంలోని దత్తరామేశ్వర క్షేత్రంలో శ్రీ దత్త సచ్చిదానంద నగరేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో 29వ వార్షిక లఘుమహారుద్రాభిషేక విశ్వశాంతి మహాయజ్ఞం ఎంతో వైభవంగా నిర్వహించబడుతోంది. పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల దివ్యాశీస్సులతో ఈ యజ్ఞ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

​స్వయంభూ లింగాలకు స్వయంగా అభిషేకాలు

​ఈ యజ్ఞ మహోత్సవాలు కార్తీక శుద్ధ పాడ్యమి (మంగళవారం, 10-11-2026) నుండి ప్రారంభమై, డిసెంబర్ 9, 2026 వరకు దాదాపు నెల రోజుల పాటు వైభవంగా సాగనున్నాయి. ఈ పవిత్ర రోజుల్లో భక్తులు స్వయంగా క్షేత్రంలోని స్వయంభూ లింగాలకు అభిషేకాలు చేసుకునే అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నారు.

​నిత్య కార్యక్రమాల వివరాలు

​ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు: మహాన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకము

​మధ్యాహ్నం 1:30 నుండి 2:00 వరకు: రుద్రహోమము, మహాపూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం, వేదస్వస్తి, తీర్థప్రసాద వినియోగం

​మధ్యాహ్నం 12:30 గంటలకు: భక్తులందరికీ నిత్య ఉచిత అన్నప్రసాద వితరణ

​యజ్ఞంలో ప్రధాన విశేష కార్యక్రమాలు

​10-11-2026 (మంగళవారం): మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష్మీగణపతి హోమం, రుద్ర హోమంతో యజ్ఞ ప్రారంభం.

​13-11-2026 (శుక్రవారం): నాగచతుర్థిని పురస్కరించుకుని వల్లీ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం.

​20-11-2026 (శుక్రవారం): మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం, నవచండీ పారాయణ, చండీ హోమం, రుద్రహోమం.

​24-11-2026 (మంగళవారం): కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక సముద్ర స్నానాలు మరియు పూజలు.

​27-11-2026 (శుక్రవారం): సంకష్టహర చతుర్థి, విఘ్నేశ్వరునికి అభిషేకాలు, గణపతి హోమం మరియు అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లక్ష్మీ మేడిపత్రి అర్చన.

​01-12-2026 (మంగళవారం): అనఘాష్టమి వ్రతము.

​04-12-2026 (శుక్రవారం): శ్రీ నగరేళ్వరస్వామివారికి మహా రుద్రాభిషేకం, అమ్మవారికి స్వప్న లక్ష్మీ కుంకుమార్చన, సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి క్షీరాభిషేకం.

​09-12-2026 (బుధవారం): ఉదయం 10-00 గంటలకు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నగరేళ్వరస్వామి వారి శాంతి కల్యాణము, మహాపూర్ణాహుతి, దీక్షా సమాప్తి, వేద పండితులకు సన్మానం, అనంతరం బృహత్ అన్నసమారాధన.

​15-12-2026 (మంగళవారం): శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు.

​యాత్రికులకు ఉచిత నిత్య అన్నప్రసాద సౌకర్యం

​దూర ప్రాంతాల నుండి మంగినపూడికి సముద్ర స్నానాల కోసం వచ్చే యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశానుసారం గత 25 సంవత్సరాలుగా క్షేత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతున్నట్లుగా కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.  మరిన్ని వివరాలకు  98483 73537, 98481 53721, 72072 22222, 94418 65555, 92467 89495 ఫోన్ నెంబర్ ని సంప్రదించండి.

About Author

SSN