MachilipatnamLocal News
November 22, 2026
ఫీచర్స్

పీఎం సూర్య ఘర్ పథకంలో సరికొత్త రికార్డు: కోసోల్ ఎనర్జీస్ & కియాన్ కు అత్యున్నత జాతీయ అవార్డు!

  • November 5, 2026
  • 1 min read
పీఎం సూర్య ఘర్ పథకంలో సరికొత్త రికార్డు: కోసోల్ ఎనర్జీస్ & కియాన్ కు అత్యున్నత జాతీయ అవార్డు!

న్యూఢిల్లీ:

దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో వైభవంగా జరుగుతున్న ‘భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్‌పో 2026’ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ “పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన” ఒక అద్భుతమైన ప్రజా ఉద్యమంగా మారిందని కొనియాడారు. ఇదే వేదికపై అత్యధిక రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేసి రికార్డు సృష్టించిన కోసోల్ ఎనర్జీస్ & కియాన్ (Kosol Energies & Kion) సంస్థ కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకుంది.

జాతీయ స్థాయిలో మెరిసిన కోసోల్ ఎనర్జీస్ & కియాన్

ఈ సమ్మిట్‌లో కేంద్ర నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ (MNRE) చేతుల మీదుగా కోసోల్ ఎనర్జీస్ & కియాన్ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

 * 38,741 ఇన్‌స్టాలేషన్ల సంచలనం: ఇప్పటివరకు ఏకంగా 38,741 ఇళ్లకు నాణ్యమైన సోలార్ సిస్టమ్‌లను విజయవంతంగా అందించి, వాటి స్కానింగ్ ప్రాసెస్ పూర్తి చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.

 * టీమ్ కృషికి గుర్తింపు: వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన మరియు విశ్వసనీయమైన సోలార్ సేవలను అందించడంలో కోసోల్ ఎనర్జీస్ & కియాన్ టీమ్ పడ్డ కష్టానికి మరియు చూపిన అంకితభావానికి ఈ పురస్కారం తగిన గుర్తింపుగా నిలిచింది.

పీఎం సూర్య ఘర్: ఒక ప్రజా ఉద్యమం — కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్ర నూతన మరియు పునరుత్పాదక శక్తి, విద్యుత్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. “ఈ పథకం ప్రజలకు సున్నా విద్యుత్ బిల్లుల ఉపశమనాన్ని ఇవ్వడమే కాకుండా, దేశానికే ఇంధన భద్రతను పెంచుతోంది” అని పేర్కొన్నారు.

సదస్సులోని కీలక ముఖ్యాంశాలు

 * వేగవంతమైన ఇన్‌స్టాలేషన్లు: భారత్ ప్రస్తుతం ప్రతి ఆరు రోజులకు సుమారు ఒక లక్ష రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లను పూర్తి చేస్తూ ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నమోదు చేస్తోంది.

 * జీరో కరెంట్ బిల్లులు & ఆదాయం: లక్షలాది కుటుంబాలు ఉచిత విద్యుత్‌ను పొందడమే కాకుండా, తమ వద్ద ఉన్న మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ప్రతి నెలా అదనపు సామూహిక ఆదాయాన్ని పొందుతున్నాయి.

 * సౌర శక్తిలో సంచలన వృద్ధి: 2014లో దేశంలో కేవలం 3 GWగా ఉన్న సౌర శక్తి సామర్థ్యం, నేడు 172 GWకి చేరినట్లు మంత్రి వెల్లడించారు.

About Author

SSN