మచిలీపట్నం :
మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, పట్టాభి భావన్‌లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అందే శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా జనరల్ సెక్రటరీ కొడమంచిలి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కుల వివక్ష, అంటరానితనంపై పూలే నిరంతరం పోరాటం చేసి, బడుగు బలహీన వర్గాలకు హక్కులు సాధించిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం కోఆర్డినేటర్ అప్ప్లికెంట్ శానం పవన్‌ధీర్ మాట్లాడుతూ, 1873లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు స్థాపించిన ‘సత్యశోధక సమాజం కుల వివక్ష నిర్మూలనకు, సమాజంలో సమానత్వ స్థాపనకు మార్గదర్శకంగా నిలిచింది. పూలే బడుగు వర్గాల ఆశాజ్యోతి, సత్యానికి ప్రతీక” అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు విస్సం శెట్టి విజయభాస్కర్ మాట్లాడుతూ, “1848లో పూణేలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించడం ద్వారా మహిళా విద్యకు శ్రీకారం చుట్టిన మహాత్మా పూలే గారు మరియు సావిత్రిబాయి ఫులె సేవలు అపూర్వం అన్నారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పుల్లంకి లోకేష్, చిల్లిపోటీ ప్రసాద్, నల్లబోలు సామ్యూల్, గరికపాటి శంకర్, సయ్యద్ నూరుద్దీన్, ముక్కు శ్రీనివాస్, షేక్ గౌస్, ప్రభుదాస్, అబ్దుల్ జఫర్, సయ్యద్ సైఫుల్ల, వసంత, నందిని, నల్లబోలు కుమారీ, ఆఖ్తర్ జమానీ బేగం తదితరులు పాల్గొన్నారు.