కృష్ణా యూనివర్సిటీలో భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
మచిలీపట్నం:
రానున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను అనుసరించి కృష్ణా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారీ జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించడం జరిగింది.

ఈ ర్యాలీని వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే రాంజీ జాతీయ జెండా ఊపి ప్రారంభించిన తదుపరి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక చిహ్నంగా జాతీయ జెండాను రూపొందించి దేశానికి అందించిన ఘనత ఈ గడ్డపై జన్మించిన పింగళి వెంకయ్యకు దక్కడం మనందరికీ గర్వకారణమనీ, రానున్న తరం జాతీయ భావంతో మెలగాలని అభిలషించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష మాట్లాడుతూ ప్రతి ఇంటా జెండా అనే నినాదం ప్రతి ఒక్కరూ పాటించాలని, ఈ సందర్భంగా మీ ఇంటిపై కూడా జాతీయ జెండాను ఉంచి భారతీయతను, తద్వారా జాతీయ భావజాలాన్ని పెంపొందించాలన్నారు. వర్సిటీలోని ఎన్ సి సి క్యాడెట్లు సైతం భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని జెండా వందనం కార్యక్రమానికి రిహార్సల్స్ లో భాగంగా క్యాంపస్ అంతా కదం తొక్కారు.

ఈ కార్యక్రమంలో క్యాంపస్ లోని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వైకే సుందర కృష్ణ, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా ఎం శ్రావణి, ఎన్ సి సి లెఫ్ట్నెంట్ డా. డి రామశేఖర్ రెడ్డి,వర్సిటీ లోని వివిధ కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు, బోధనా సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

