కృష్ణా జిల్లా ఎస్సి యువతకు ఉపాధి శిక్షణ కొరకు దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ వారి ఆదేశాలు అనుసరించి 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పూర్తి అయిన షెడ్యూల్డ్ కులములకు చెందిన నిరుద్యోగ యువతకు పలు కోర్సులలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార సంఘం కార్యనిర్వహణాధికారి జే సత్యవతి ఒక ప్రకటనలో తెలిపారు
ఎనిమిదవ తరగతి విద్యార్హతతో ఎలక్ట్రిక్ వెహికల్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, పదవ తరగతి అర్హతతో కిసాన్ డ్రోన్ ఆపరేటర్, బ్యూటీ తెరపిస్ట్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్, ఇంటర్మీడియట్ విద్యార్హతతో ప్లంబర్, జనరల్ కోర్సులు, సోలార్ పివి ఇన్స్టాలర్ సూర్యమిత్ర కోర్సులలో శిక్షణ పొందుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జే సత్యవతి తెలిపారు.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన సదుపాయము, వసతి కల్పించబడును. కోర్సుల వ్యవధి 90 రోజులు. శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశములు కల్పిస్తారు. 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సు గల ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు తో పాటు కుల దృవీకరణ పత్రము, ఆధార్, రైస్ కార్డ్ ఫోటో స్టాట్ కాపీలు జతపరచి స్వయంగా గాని లేదా ఈమెయిల్ ద్వారా గానీ ఐదు రోజుల లోపుగా ఈ కార్యాలయంలో సమర్పించవలసినదిగా తెలియజేసినారు. పూర్తి వివరములకు 9652057244/9848214161 నంబర్లను సంప్రదించవలసిందిగా తెలిపారు.

