MachilipatnamLocal News
September 20, 2026
జిల్లా

కృష్ణా జిల్లాలో మద్యం షాపుల రెన్యూవల్: ఎక్సైజ్ శాఖ ప్రకటన

  • September 12, 2026
  • 1 min read

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలోని 135 మద్యం షాపుల (123 జనరల్, 12 గీత కులాలు) లైసెన్సులను మరో ఏడాది పాటు రెన్యూవల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 01 అక్టోబర్ 2026 నుండి 30 సెప్టెంబర్ 2027 వరకు లైసెన్సులు పొడిగిస్తూ 2026-27 ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలను ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి M.K. మీనా విడుదల చేశారు.

లైసెన్స్ & రెన్యూవల్ ఫీజు వివరాలు:

రెన్యూవల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (R.E.T): లైసెన్సీలు లైసెన్స్ ఫీజులో 38% ప్రారంభంలోనే ఒకేసారి చెల్లించాలి.

50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 23,00,000

50,000 నుండి 5,00,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 27,20,000

5,00,000 పైన జనాభా ఉన్న ప్రాంతాల్లో: రూ. 35,50,000

రిజర్వ్ షాపులు (గీత కులాలు): రెన్యూవల్ లైసెన్స్ ఫీజులో 50% చెల్లించాలి.

మొత్తం లైసెన్స్ ఫీజు: జనాభాను బట్టి ఏటా రూ. 60,50,000, రూ. 71,50,000 మరియు రూ. 93,50,000 గా నిర్ణయించారు. దీనిని 4 విడతల్లో చెల్లించవచ్చు.

పర్మిట్ రూమ్ ఫీజు: 50,000 లోపు జనాభా ఉంటే రూ. 5,00,000; అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే రూ. 7,50,000 గా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల స్వీకరణ & ప్రొసెసింగ్:

రెన్యూవల్ షాపులు: 12-09-2026 నుండి 21-09-2026 సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో లేదా కృష్ణా జిల్లా మద్య నిషేధ కార్యాలయం (బైపాస్ రోడ్) నందు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రొసెసింగ్ ఫీజు రూ. 5,000.

కొత్త షాపులు: రెన్యూవల్ కాని షాపులకు 22-09-2026 నుండి 29-09-2026 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుము రూ. 3,00,000 కాగా, ప్రొసెసింగ్ ఫీజు రూ. 1,000 గా ఉంటుంది.

ఒక షాపుకు 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లక్కీ లాటరీ తీస్తారు. రెన్యూవల్ కాని షాపులకు లాటరీ ప్రక్రియ 30-09-2026న నిర్వహిస్తారు.

ఇతర వివరాల కోసం కృష్ణా జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కార్యాలయం లేదా ఎక్సైజ్ స్టేషన్లలో, లేదా 8466981837 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి సంప్రదించాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి (ఇన్ఛార్జ్) తెలిపారు.

About Author

SSN