రాధా రంగా మిత్రమండలి మేయర్ అభ్యర్థిగా బుల్లెట్ ధర్మారావు
మచిలీపట్నంలో రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముందుగా వంగవీటి మోహన రంగా, శ్రీ కృష్ణదేవరాయల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో రాధా రంగా మిత్రమండలి మరియు మహిళా కమిటీ సభ్యులు పాల్గొని, రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో మచిలీపట్నంలోని 10 కార్పొరేటర్ వార్డులతో పాటు మేయర్ అభ్యర్థిగా బుల్లెట్ ధర్మారావును కూటమి తరపున కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గత 40 సంవత్సరాలుగా బుల్లెట్ ధర్మారావు రాధా రంగా మిత్రమండలిని నడిపిస్తూ, కులమతాలకు అతీతంగా అందరినీ ఆదుకుంటూ మహిళలకు సమాన భాగస్వామ్యంతో గౌరవప్రదమైన పదవులు కల్పించారని వారు గుర్తుచేశారు.
గత ఎన్నికలలో కూటమి విజయం కోసం ధర్మారావు ఎంతో కృషి చేశారని తెలుపుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ లకు విజ్ఞప్తి చేశారు. స్థానిక మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర భవిష్యత్తులో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని, అలాగే ఎంపీ వల్లభనేని బాలశౌరి ధర్మారావు కృషిని గుర్తించి ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం లేఖ ఇచ్చినప్పటికీ, పొత్తులో భాగంగా ఆ పదవి టీడీపీకి వెళ్లినందున ఇప్పుడు మేయర్ స్థానాన్ని కేటాయించాలని కోరారు.
ధర్మారావును కూటమి అభ్యర్థిగా బరిలోకి దింపితే అత్యధిక మెజారిటీతో గెలిపించి మచిలీపట్నం కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై త్వరలోనే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, బూరగడ్డ వేదవ్యాస్, గొర్రెపాటి గోపీచంద్ తదితర పెద్దలను కలవనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో LIC రాంబాబు, షేక్ సిరాజుద్దీన్, మత్తి వెంకటేశ్వరరావు, వన్నెంరెడ్డి ప్రసాద్, వెన్న నాగఫణి రాజ్, మోకా మల్లిక, తోట విజయ కుమారి, రాయపరెడ్డి నాగమణి, ముంగండ బాలా కుమారి, ఎడ్ల అప్పాయమ్మ, గోపిశెట్టి దుర్గ, ఉమ్మారెడ్డి నాగమణి, యాదల పుణ్యవతి, బొమ్మసాని లక్ష్మి ప్రసన్న, వన్నెంరెడ్డి కుమారి, విన్నకోట సుబ్బారావు, అనభం సాయి, తలారి నాగమల్లేశ్వరరావు, జరుగు వెంకట సుబ్బారావు, నరహరిశెట్టి రామకృష్ణ, తోట బుజ్జి నాయుడు, ఇంటి రామారావు, పుప్పాల భాను, ఘంటసాల సుబ్బారావు, నూకల బెనర్జీ, నూకల రమేష్ బాబు, పర్ణం సుబ్బయ్య, బాకీ విజయ్ కుమార్ సహా రంగా, పవన్ కళ్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

