MachilipatnamLocal News
July 14, 2026
జిల్లా

జూన్ 17,18 తేదీలలో నిరుద్యోగ ఎస్.సి. యువతీ యువకులకు నైపుణ్య ఉపాధి మేళా లు

  • June 16, 2026
  • 0 min read
[addtoany]
జూన్ 17,18 తేదీలలో నిరుద్యోగ ఎస్.సి. యువతీ యువకులకు నైపుణ్య ఉపాధి మేళా లు

మచిలీపట్నం :

జిల్లాలోని చదువుకున్న నిరుద్యోగ ఎస్. సి. యువతీ యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో కేంద్ర ప్రభుత్వ పథకం పీ.ఎం.అజయ్ పథకం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ ఎస్.సి. యువతీ యువకులకు నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ఉపాధి మేళాలు నిర్వహించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం అజయ్) పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో బహుళ రంగాల జీవనోపాధి కల్పించు ప్రదర్శనలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మేళాలు భవిష్యత్తు వృత్తిపరమైన సలహాలు వంటి కార్యక్రమాలను ఈనెల 30వ తేదీలోగా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

వాణిజ్యస్థాయి పాడి పరిశ్రమ యూనిట్లు ఆధునిక పద్ధతిలో కూడిన కోళ్ల పెంపకము వ్యవసాయము చేనేత సూక్ష్మస్థాయి చిల్లర వ్యాపారాలు వంటి ఆచరణ సాధ్యమైన ప్రాంతీయ వ్యాపారాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అత్యంత నిరుపేద ఎస్ సీ కుటుంబాలకు గ్రాంట్ తో అనుసంధానించబడిన బ్యాంకు రుణాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చదువుకున్న నిరుద్యోగ ఎస్. సి. యువతీ యువకులకు వారికి ఆసక్తిగల రంగాలలో నైపుణ్యంతో కూడిన శిక్షణ పొందిన తరువాత వారు ఎంచుకున్న వ్యాపార రంగానికి కావలసిన ఆర్థిక సహాయమును సంబంధిత బ్యాంకులో నుండి ,ఎస్సీ సంక్షేమ శాఖ నుండి, పీఎం అజయ్ పథకం కింద సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి జీ రమేష్ మాట్లాడుతూ ఈనెల 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘ కార్యాలయంలో, 18వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు గుడ్లవల్లేరు ఎంపీడీవో కార్యాలయంలో నైపుణ్య ఉపాధి మేళా లు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్కు వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకులు బీసీ సంక్షేమ అధికారి జి రమేష్, జెడ్పీ డిప్యూటీ సీఎం ఆనందకుమార్, డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, డిఐసి జిఎం వెంకటరావు, పశుసంవర్ధక శాఖ ఏడి నరసింహస్వామి, ఎల్డీఎం రవీంద్ర రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, కరస్పాండెంట్ రమేషు, ఎస్సీ కార్పొరేషన్ పర్యవేక్షకులు శారద తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN