MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లీలా కృష్ణ ప్రసాద్

  • March 7, 2026
  • 1 min read
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లీలా కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం, 7 మార్చి 2026, SSN:
 
      విజయవాడ క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. లీలా కృష్ణ ప్రసాద్ శనివారం మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని వైద్య సదుపాయాలు అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పూర్తిస్థాయిలో రోగులకు అందించాలని కోరారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *