ఫైలేరియా బాధితులకు ఎంఎండిపి కిట్ల పంపిణీ
మచిలీపట్నం :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు వ్యాధి నివారణతో పాటు వైకల్య నిర్వహణ కోసం అవసరమైన ఎం ఎం డి పి కిట్లను గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి. అరుణ్ కుమార్ సంయుక్తంగా వ్యాధిగ్రస్తులకు కిట్లు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి. యుగంధర్ మాట్లాడుతూ, ఫైలేరియా బాధితులు ఎం ఎం డి పి కిట్లను సక్రమంగా ఉపయోగించడం ద్వారా అస్వస్థత నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. అలాగే జిల్లా మలేరియా అధికారి డాక్టర్ బి. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఈ కిట్లను అందజేస్తూ వైద్య సహాయం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు

