MachilipatnamLocal News
September 5, 2026
పోలీస్ & లీగల్ డైరీ

ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్‌లో రజత పతకం సాధించిన కృష్ణా డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్

  • May 15, 2026
  • 0 min read
ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ క్లస్టర్‌లో రజత పతకం సాధించిన కృష్ణా డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్

మచిలీపట్నం :

డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ కె. లక్ష్మణ రెడ్డి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతూ పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో నిర్వహించిన రెండవ అల్ ఇండియా పోలీస్ బాడ్మింటన్ క్లస్టర్ టోర్నమెంట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకాన్ని సాధించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీస్ శాఖలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో కె. లక్ష్మణ రెడ్డి తన క్రీడా నైపుణ్యం, క్రమశిక్షణ, పోరాట పటిమతో మెరిసి ఈ విజయాన్ని అందుకోవడం కృష్ణాజిల్లా పోలీస్ శాఖకు గర్వించదగిన అంశం. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఇన్స్పెక్టర్ ని ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు.

ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకోవడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయి. జాతీయ స్థాయిలో రజత పతకం సాధించడం ఎంతో గర్వకారణం. ఈ విజయం యువ పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకం” అని అన్నారు.

About Author

SSN