MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక నిఘా.. మచిలీపట్నంలో 5 దుకాణాలపై కేసులు, జరిమానాలు

  • November 17, 2026
  • 1 min read
బియ్యం ధరల నియంత్రణపై ప్రత్యేక నిఘా.. మచిలీపట్నంలో 5 దుకాణాలపై కేసులు, జరిమానాలు

మచిలీపట్నం:

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక రేట్లకు బియ్యం విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి టీ. శివ రామప్రసాద్ హెచ్చరించారు. బహిరంగ మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు–కొలతలు, ఆహార భద్రత శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

జిల్లావ్యాప్తంగా 31 కేసుల నమోదు

తనిఖీలలో భాగంగా మంగళవారం మచిలీపట్నంలో అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్న ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 31 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అక్రమంగా బియ్యం నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా ఉపేక్షించేది లేదని, ప్రతి దుకాణంలో వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ధరల పట్టికను ప్రదర్శించాలని టోకు, చిల్లర వ్యాపారులను ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరల వివరాలు (కిలోకు):

 * బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ), కేఎన్ఎం రకాలు: రూ. 66

 * హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలు: రూ. 76

 * జై శ్రీరామ్ రకం: రూ. 82

 * ఎంటీయూ కాటన్ వెరైటీ: రూ. 47

ఈ తనిఖీల్లో విజిలెన్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ టీ. కృష్ణ సాయి, తూనికలు-కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్.కే. రాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రగీత్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.

#Machilipatnam #KrishnaDistrict #RicePrices #CivilSupplies #VigilanceRaids #SreeSyamNews #SSN #SSNews #ConsumerRights #AndhraPradesh

About Author

SSN