MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

‘అక్వాన్’ తుఫాన్ ఎఫెక్ట్: కృష్ణా సర్కిల్ పరిధిలో ఏపీసీపీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

  • November 17, 2026
  • 1 min read
‘అక్వాన్’ తుఫాన్ ఎఫెక్ట్: కృష్ణా సర్కిల్ పరిధిలో ఏపీసీపీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు

మచిలీపట్నం:

‘అక్వాన్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ప్రజలకు నిరంతర సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APCPDCL) కృష్ణా సర్కిల్ పరిధిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సంస్థ సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన సరఫరాను పునరుద్ధరించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు

విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా ప్రమాదాలపై తక్షణమే సమాచారం అందించేందుకు కృష్ణా సర్కిల్ పరిధిలో ఈ క్రింది ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.

 * కృష్ణా సర్కిల్ కంట్రోల్ రూమ్: 6281709355

 * మచిలీపట్నం డివిజన్: 9440817572

 * గుడివాడ డివిజన్: 9440817573

 * ఉయ్యూరు డివిజన్: 7382623231

ప్రజలకు సీఎండీ విజ్ఞప్తి

తుఫాన్ సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎండీ పి. పుల్లారెడ్డి కోరారు. బలమైన గాలులకు తెగిపడిన విద్యుత్ తీగలు, నేలకొరిగిన స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేదా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1912కు గానీ, లేదా పై కంట్రోల్ రూమ్ నంబర్లకు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

About Author

SSN