విద్యార్థులకు చట్టాలపై అవగాహన.. మచిలీపట్నంలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సులు
మచిలీపట్నం:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎస్. వరలక్ష్మి తెలిపారు. నవంబర్ 24, 2026 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా కొనసాగనున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ మరియు రుద్రవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు మరియు రక్షణ కోసం ఉద్దేశించిన ‘సురక్షిత బచ్పన్ అభియాన్’, లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO Act) గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ‘నాల్సా డాన్ స్కీమ్’ (Drug Awareness and Wellness Navigation – DAWN) ద్వారా విద్యార్థులను చైతన్యపరిచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్. వరలక్ష్మి సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమాలలో డీఎల్ఎస్ఏ న్యాయవాదులు సోగన క్రాంతి శ్రీ, ఎం.బి.ఎల్. మణిమాల పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ సదస్సులలో పాల్గొన్నారు.
#Machilipatnam #DLSA #NALSA #LegalAwareness #POCSOAct #DrugAwareness #DAWNScheme #KrishnaDistrict #SreeSyamNews #SSN #SSNews #StudentSafety

