MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

అకాల వర్షాలతో నల్ల బంగారం కుదేలు – ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు

  • March 19, 2026
  • 0 min read
అకాల వర్షాలతో నల్ల బంగారం కుదేలు – ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షులు శీలం నారాయణరావు
ఘంటసాల :
 
కృష్ణాజిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన వర్షాలతో నల్ల బంగారం (మినుము) పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు గురైనారు. మరో వారంలో పండిన పంట రైతు ఇంటికి చేరేది. గురువారం కురిసిన వర్షాలతో మినుము పంట చేతికొచ్చే టైములో నష్టపోయే అవకాశం ఏర్పడింది. డిసెంబర్లో అకాల వర్షాలతో వరి ధాన్యం దెబ్బతింటే, గురువారం పడిన వర్షాలతో మినుము పంట దెబ్బతినే అవకాశం ఏర్పడింది.
 
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు రైతులు పరిస్థితి తయారయింది. రైతులను పకృతి వెంటాడుతుంది. చాలామంది రైతులు తమ పంటను పోగేసి పరదాలతో కప్పటం జరిగింది. మరి కొద్ది మంది రైతుల పంట పనలపై ఉంది. ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్న నల్ల బంగారం పంటను పరిశీలించి రైతులను, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణాజిల్లా కమిటీ అధ్యక్షులు శీలం నారాయణరావు విజ్ఞప్తి చేశారు.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *