తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి నివాళులు
మచిలీపట్నం:
తెలుగు వాడుక భాషోద్యమానికి ఆద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషా వికాసానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధి, వ్యాప్తికి గిడుగు రామమూర్తి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ జిల్లా కలెక్టర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డిఆర్ఓ ఎస్ పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

