MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మార్చి నాటికి బందరు పోర్టు పూర్తి చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • August 13, 2026
  • 1 min read
మార్చి నాటికి బందరు పోర్టు పూర్తి చేస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం:

కృష్ణాజిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన మచిలీపట్నం పోర్టు మార్చి నాటికి నాలుగు బెర్తులతో  మళ్లీ వెలుగులీననుందని రాష్ట్ర గనులు, భూగర్భవనలు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి సంబంధించి 4 బెర్తు నిర్మాణాలు పూర్తికాబోతున్నాయన్నారు. అలాగే నార్త్,సౌత్  వాటర్ బ్రేక్ పనులు కు సంబంధించిన పనులు 95 శాతం మేర పూర్తయ్యాయన్నారు.

2019 -24 కాలంలో నిర్లక్ష్యానికి గురికాగా తిరిగి 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల కాలంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయని, 2027 మార్చి జూన్ మధ్య పోర్టు ప్రారంభానికి సన్నాహాలు చేస్తామన్నారు.బందర్ పోర్టు కృష్ణాజిల్లాకే కాక అమరావతికి తలమానికం కాబోతుందన్నారు హైదరాబాదుకు సమీపంలో ఉన్న మచిలీపట్నం పోర్టును సద్వినియోగం చేసుకునేందుకు ఆ రాష్ట్రం ఎంతో ఉత్సాహంతో ఉందన్నారు. ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసేదిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు .పోర్టుకు అనుసంధానంగా రైల్వే, రోడ్డు కనెక్టివిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు‌

 వీటికి అదనంగా నార్త్ లో మరో రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల కేంద్రంలో సంబంధిత అధికారులు మంత్రులతో చర్చించడం జరిగిందన్నారు. ఇప్పటికే పోర్టుకు అనుబంధ పరిశ్రమలు నెలకొల్పేందుకు అనేక కంపెనీలు క్యూ కడుతున్నాయని తద్వారా మచిలీపట్నం తో పాటు పరిసర ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని మంత్రి రవీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author

SSN