MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మార్కెట్ అనుసంధానం, నాణ్యత, సాంకేతికతతో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించాలి

  • July 28, 2026
  • 1 min read
మార్కెట్ అనుసంధానం, నాణ్యత, సాంకేతికతతో ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని పెంపొందించాలి

మచిలీపట్నంలో రెండు రోజుల వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అన్నారు. “మార్కెట్ అనుసంధానం, నాణ్యత, సాంకేతికత ద్వారా ఎంఎస్ఎంఈల పోటీతత్వాన్ని బలోపేతం చేయడం” అనే అంశంపై ఎంఎస్ఎంఈ టూల్ రూమ్– సిఐటిడి, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఆర్ఏఎంపి పథకం కింద మచిలీపట్నంలోని విజయ శ్రీ ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లా వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్ (ODOP) కింద ఎంపికైన ఇమిటేషన్ జ్యువెలరీ, కలంకారి రంగాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మార్కెట్ అనుసంధానం, నాణ్యత, బ్రాండింగ్, సాంకేతిక పరిజ్ఞానం, ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే స్థానిక పారిశ్రామికవేత్తలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బయ్యర్–సెల్లర్ మీట్‌ల ద్వారా పెద్ద సంస్థలతో ప్రత్యక్ష వ్యాపార సంబంధాలు ఏర్పరచుకొని తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను విస్తరించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. సుధాకర్, కెవిఐసి అసిస్టెంట్ డైరెక్టర్ ఆశుతోష్ సింగ్, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్ రవీంద్ర గౌతమ్, జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కె. నాగేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ కె. వేణు, ఎన్ఎస్ఐసి మేనేజర్ కిరణ్, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ డైరెక్టర్ వి. సాంబశివరావు, ఎంఎస్ఎంఈ టూల్ రూమ్– సిఐటిడి డిప్యూటీ డైరెక్టర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎస్. వెంకట కృష్ణ, ఇమిటేషన్ జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. సుబ్బారావు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) మచిలీపట్నం మేనేజర్ (పర్చేజ్) ఎ. శ్రీకాంత్, పారిశ్రామికవేత్తలు, ఇమిటేషన్ జ్యువలరీ, గుర్రపు డెక్క కళాకృతులు, కలంకారి రంగాల వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN