న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్
మచిలీపట్నం:
శనివారం కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాకిస్తాన్ సైన్యంపై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయానికి దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సర్వీస్ మెన్ జాయింట్ సెక్రటరీ అబ్దుల్ సలాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ రహీం, మాజీ సైనికులు, న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు మణికంఠ, సాయికుమార్, సాయి శ్రీవత్సాస్ పాల్గొన్నారు

