జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనకు మచిలీపట్నం బార్ అసోసియేషన్ మద్దతు
మచిలీపట్నం:
దేశ రాజధాని ఢిల్లీ లో విద్యార్థుల నిరసన సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై మచిలీపట్నం బార్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఛలో సంసద్ సందర్భంగా విద్యార్ధులపై పోలీసులు చేసిన లాఠీచార్జి ను న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు నేతృత్వంలో న్యాయవాదులు విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని, కఠిన చట్టాల ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల చేపట్టిన ఉద్యమానికి మచిలీపట్నం బార్ అసోసియేషన్ తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మచిలీపట్నం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సర్వా లలితకుమారి, వైస్ ప్రెసిడెంట్ డి. శివకుమార్, సీనియర్ న్యాయవాదులు జె. నెహ్రు, గుండు ప్రకాష్, పి. సూర్యప్రకాష్, ప్రభాకర్, రఘురామ్, మహిళా న్యాయవాదులు నవీన, క్రాంతి శ్రీ, శరణ్య, సీత, విజయ, రమణి, కృప, నాగమణి, రూపారాణి, జగతి తదితరులు పాల్గొన్నారు.

