MachilipatnamLocal News
July 20, 2026
జిల్లా

మడ అడవులను కాపాడండి – కలెక్టర్ కు ఫిర్యాదు

  • June 29, 2026
  • 0 min read
[addtoany]
మడ అడవులను కాపాడండి – కలెక్టర్ కు ఫిర్యాదు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, మచిలీపట్నం డివిజన్ ల పరిధిలోని తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న 34,006 హెక్టార్లలో విస్తరించి ఉన్న మడ అడవులను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం పీజీ ఆర్ఎస్ లో యునైటెడ్ ఫారం ఫర్ ఆర్టిఐ క్యాంపెయిన్ ప్రతినిధులు జంపాన శ్రీనివాస్ గౌడ్, బొల్లా శివ పార్వతి సోమవారం మీకోసంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం అవనిగడ్డ డివిజన్లలో కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ (సిఆర్జెడ్) నిబంధనలకు వ్యతిరేకంగా మడ అడవులను నరికి అక్రమంగా రొయ్యలు చెరువులుగా మారుస్తున్నారని అట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అలాగే స్వర్ణ పంచాయితీ పోర్టల్ లో జనవరి ఫిబ్రవరి నెలలలో పంచాయతీ కార్యదర్శులు డీజిల్, పెట్రోల్, ఇతర పనుల పేరుతో ఎస్టిమేట్లు, ఎం బుక్ లో నమోదు, టెండర్లు లేకుండా లక్షలాది రూపాయలు గ్రామపంచాయతీ నిధులను డ్రా చేసి అవినీతికి పాల్పడినట్లు ఆర్టిఐ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అవినీతికి పాల్పడిన పంచాయితీ సొమ్మును రికవరీ చట్టం 1864 ప్రకారం ప్రభుత్వానికి రికవరీ చేసి కార్యదర్శులను ప్రభుత్వ సర్వేసు నుండి తొలగించాలని ఫిర్యాదుదారులు జంపాల శ్రీనివాస్ గౌడ్, బి శివపార్వతి పేర్కొన్నారు.

About Author

SSN