ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నూతన ఆర్‌ఎంఓగా డా జి భానుమూర్తి
మచిలీపట్నం:
ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు నూతన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ ( ఆర్ ఎం ఓ) గా ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. జి. భానుమూర్తిని నియమితులయ్యారు. డా. భానుమూర్తి ప్రస్తుతం జిల్లా అంధత్వ నివారణ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా కంటి శస్త్రచికిత్సల నిర్వహణలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాల్లో నిలిచిన జిల్లాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రజలకు అందుబాటులో కంటి వైద్య సేవలను విస్తరించడం, అంధత్వ నివారణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆయన విశేష కృషి చేశారు. అసిస్టెంట్ ఆర్‌ఎంఓలుగా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాజన్ తో పాటు డా. నాగలక్ష్మిలను నియమించారు.

