MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తోలుబొమ్మలాంటి కమిషనర్ ని నిలదీయడం దేనికి? : మాజీ మంత్రి పేర్ని నాని

  • May 25, 2026
  • 0 min read
[addtoany]
సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తోలుబొమ్మలాంటి కమిషనర్ ని నిలదీయడం దేనికి? : మాజీ మంత్రి పేర్ని నాని

ఏప్రిల్ ఒకటో తారీకు జెసిబి తో మచిలీపట్నం కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న జనసేన కార్యకర్త ఇంటిని అనుమతులు లేవని పగలగొట్టడం మొదలుపెట్టారు. ఏప్రిల్ రెండో తారీకు జెసిబి తో పాటు ప్రోక్ లైనర్ కూడా తీసుకెళ్లి ఇంటిని తునాతనకలుగా నేలమట్టం చేశారు. పగవాడికి కూడా రాకూడని కష్టం వచ్చింది అని ఎంపీ అంటున్నారు. మరి ఒకటో తారీకున పగలగొట్టడం మొదలుపెట్టినప్పుడే ఆగమేఘాల మీద ఎంపీ రావాలి కదా!

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉన్నారు. వచ్చి రెండో తారీకు పొద్దున్నే జిల్లా కలెక్టర్ ని నిలదీయాలి కానీ తోలుబొమ్మ లాంటి కమిషనర్ ని ఎందుకు నిలదీస్తున్నారు. ఏప్రిల్ రెండో తారీఖున ఇంటిని నేలమట్టం చేస్తే ఏప్రిల్ 8వ తారీఖున ఎంపీ మచిలీపట్నం వచ్చి పరిహారం చెల్లిస్తానన్నారు. మున్సిపల్ కమిషనర్ని ఎంపీ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి వివరణ కోరితే మంత్రి గారితో మాట్లాడి మళ్ళీ వస్తానని కమిషనర్ వెళ్లిపోయారు. మరి ఎంపీ బాలసౌరి మంత్రిని కలిసి అడిగారా? ఏప్రిల్ 2న జరిగిన విషయంపై మే 23న తోలుబొమ్మలాంటి కమిషనర్ని వివరణ అడగడం ఏంటి? 200 మంది పోలీసులు వచ్చారని ఎంపీ చెబుతున్నారు కానీ మా లెక్క ప్రకారం 300మంది పైనే పోలీసులు వచ్చారు. మరి ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి ఎస్పీని ఎంపీ అడిగారా ఇంతమంది పోలీసులు ఎలా వచ్చారు అని. పక్కన కూర్చున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీని అడిగారా ఎలా కూల్చారని?

సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తోలుబొమ్మలాంటి కమిషనర్ ని నిలదీయడం దేనికి? చప్పట్లు కొట్టించు కోవడానికా ఈ డ్రామా అంటూ మాజీ మంత్రి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ బాలసౌరి ని ప్రశ్నించారు.

About Author

SSN