MachilipatnamLocal News
May 26, 2026
జిల్లా

జలజీవన్ మిషన్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

  • May 26, 2026
  • 0 min read
[addtoany]
జలజీవన్ మిషన్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం:

జలజీవన్ మిషన్ పథకం కింద చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), డ్వామా, జిల్లా పంచాయతీ, ఐసిడిఎస్ శాఖల అధికారులతో జలజీవన్ మిషన్ పథకం పురోగతి, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.జలజీవన్ మిషన్ పథకం కింద మంజూరైన పనుల వివరాలు, వాటి పురోగతి, బిల్లుల చెల్లింపు స్థితిగతులను జిల్లా కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో నీటి నాణ్యత పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై ఆరా తీశారు.కోడూరు మండలంలో అత్యధికంగా పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇతర మండలాల్లో కూడా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మండలాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించిన కలెక్టర్, నిర్మాణాల్లో నాణ్యమైన సామాగ్రి వినియోగించాలని చెప్పారు. టాయిలెట్లలో టైల్స్, కమోడ్స్, స్టీల్ కొళాయిలు, సరిపడా వెంటిలేషన్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి చేయాలని సూచించారు. అవసరమైన పనులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సంబంధిత పనులు చేపడతామని వెల్లడించారు. త్వరలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టి సంబంధిత పనులను స్వయంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వహణాధికారి సోమశేఖర్, మచిలీపట్నం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజన్, జడ్పీ డిప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, డ్వామా పీడీ ఎన్ శివప్రసాద్ యాదవ్, ఐసిడిఎస్ పిడి ఎంఎన్ రాణి, డిపిఓ ధనలక్ష్మి, మండలాల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN