MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • May 13, 2026
  • 0 min read
ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం:

స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, బస్టాండ్ పరిశుభ్రత, బస్సుల సమయపాలన, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులకు స్పష్టం చేసిన కలెక్టర్, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ సమయాల్లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని డిపో మేనేజర్ పెద్దిరాజుకు సూచించారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *